రే చీకటి” మనం సినిమాల్లో అత్యంత కామెడీగా చూసే కంటి సమస్య. ఈ సమస్య తీవ్రమైతే జీవితం ఒకరకంగా నరకం అనే చెప్పాలి. దీన్ని సినిమాల్లో రియల్ లైఫ్ లో ఒక కామెడీ పార్ట్ గా చూపించినా సరే దీనితో జీవితం ఇబ్బందిగానే ఉంటుంది. అయితే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది…? వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అవగాహన రావాలి.
Also Read:మనిషి జీవితంలో భాగంగా మారిన టెక్నాలజీ..!
ఆహారంలో విటమిన్ ఏ లోపం కారణంగా ఎక్కువగా పిల్లలకు సంభవిస్తున్న వ్యాది ఇది. కంటిలోని తెల్లపొర ప్రకాశిస్తూ ఉండకుండా, పొడి ఆరిపోయినట్లుగా ఉంటుంది రే చీకటిలో. ఈ సమస్య వచ్చినప్పుడు కంటి గ్రుడ్డు మీద తెల్లని మచ్చలు కనపడుతూ ఉంటాయి. వ్యాధిగ్రస్తులు మసక వెలుతురులో వస్తువులను సరిగా చూడటం కష్టంగా ఉంటుంది. ఇంకా అశ్రద్ధ చేస్తే ఇది తీవ్రమై కళ్ళు కనపడకుండా పోతాయి.
ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూస్తే… విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న బొప్పాయి, కారట్, కోడిగ్రుడ్డు ఎక్కువగా తినాలి. అలాగే తాజా ఆకుకూరలు, పాలు మొదలైనవి ఆహారంలో సమృద్ధిగా ఉండాలి. అంధత్వ నిర్మూలన పధకం క్రింద దేశంలోని పిల్లల్ని రేచీకటి నుండి రక్షించడానికి 9 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకి 6 నెలల కొకసారి విటమిన్ ఏ ద్రావణం నోటి ద్వారా ఇవ్వడం కూడా జరుగుతుంది.
Also Read:మనిషి జీవితంలో భాగంగా మారిన టెక్నాలజీ..!