ఏపీ లో మంగళవారం నుండి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈనెల ఆఖరి వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 వరకుఈ నైట్ కర్ఫ్యూ ను విదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి,ఇండోర్ లో 100 మందికి మాత్రమే అనుమతి కల్పించింది. అయితే అంతరాష్ట్ర రవాణాకు మాత్రం అవకాశం కల్పించింది. సినిమా థియేటర్ల లో సీటు సీటుకు మధ్య గ్యాప్ కూడా ఉండాలని పేర్కొంది.
ప్రజా రవాణాలో ప్రయాణికులు,సిబ్బందికి మాస్క్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది.
మాస్క్ లేకుండా దుకాణాల్లోకి వినియోగదారులను అనుమతిస్తే గరిష్టంగా షాపు నిర్వాహకులకు 25,000 జరిమానా ఉంటుందని పేర్కొంది.
ప్రార్ధనా మందిరాల్లో కోవిడ్ నిభందనలు తప్పనిసరని
మాస్క్ ధరించని వారికి 100 రూపాయలు జరిమానా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.