ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ మరోసారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూను మొదట అమలు చేసింది సర్కారు. అయితే ఇప్పుడు మరోసారి దానిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఇవి అమలులో ఉందనున్నాయి. అలాగే మాస్కు కూడా తప్పనిసరి చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారికి వంద రూపాయలు జరిమానా కూడా విధించనుంది.
వివాహాలు శుభకార్యాలు వంటి వాటికి గరిష్టంగా రెండు వందల మంది, ఇండోర్ లో వంద మందికి మాత్రమే అనుమతి కల్పించింది. సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ తో అవకాశం కల్పించింది.
దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మతపరమైన ప్రదేశాలలో కరోనా నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని భక్తులు భౌతిక దూరం, మాస్క్‌లు ధరించటం వంటి జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.