మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట తిరుమలలో సందడిచేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న నూతన దంపతులు కొణిదెల నిహారిక జొన్నలగడ్డ చైతన్యలు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నిహారిక చైతన్య దంపతులకు వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.