మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరగనుంది. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నిహారిక- చైతన్య ఒక్కటవ్వనున్నారు.
ఇందుకోసం స్పెషల్ జెట్ లో నాగబాబు కుటుంబం ఇప్పటికే రాజస్థాన్ చేరుకోగా… మెగా ఫ్యామిలీ అంతా రాత్రికి షిఫ్ట్ కాబోతున్నారు. అయితే, ఈ పెళ్లికి బయటి వారిని, ఇండస్ట్రీ ప్రముఖులెవర్నీ ఇన్వైట్ చేయలేదని తెలుస్తోంది. పెళ్లి అంతా అయ్యాక… హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Udaipur ✈️ #NisChay ✨ pic.twitter.com/ztIgBbH7MI
— Niharika Konidela (@IamNiharikaK) December 7, 2020