మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నూతన వధువరులు అన్నవరం సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. ముందుగా నిహరిక చైతన్య దంపతులు సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. నూతన వధువరులకు కు వేదపండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని నిహారిక దంపతులకు అందజేశారు.ఉదయపూర్ లో నిహారిక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగా ఫామిలీ అందరు హాజరయ్యారు.