మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముందుగా టీవీ యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఒక మనసు చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కనిపించింది. తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ తో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది.
2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగ్గా.. చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పలు రూమర్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఈ రూమర్స్ పై నిహారిక కానీ.. చైతన్య కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే గత మూడు నెలలుగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ పోస్ట్ పెట్టింది.
ఎప్పుడూ జోష్ ఫుల్ గా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది కొణిదెల నిహారిక. తాజాగా కొత్త ఫొటో షూట్ తో నిహారిక పిచ్చెక్కించింది. రెడ్ కలర్ లంగావోణీలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించింది. మ్యాచింగ్ గాజులు, పెద్ద పెద్ద జుంకాలు.. కర్లీ హెయిర్ తో అదిరిపోయే లుక్ లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఒక హీరోయిన్ కు కావాలన్సిన అన్ని లక్షణాలు నిహారికలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
నిహారిక ఈ ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలుల్లో లైకులు వందల్లో కామెంట్లు వచ్చాయి. ఒక్క ఇన్ స్టా వేధికగానే నిహారికకు 2.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పటి వరకు 631 పోస్టులను షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన ప్రతీ ఫొటో వీడియోకి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు లైకులు షేర్లు చేశారు.
View this post on Instagram