మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక… చైతన్య జొన్నలగడ్డ ను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 9వ తేదీ రాత్రి ఏడు గంటల 15 నిమిషాలకు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ పెళ్లి జరగనుంది. కాగా ఇప్పటినుంచే మెగా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆ సందడి కి సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోస్ట్ చేస్తూ ఉన్నారు.
అయితే తమ కుటుంబంలోకి జొన్నలగడ్డ చైతన్య ను ఆహ్వానిస్తూ మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత శ్రీజ దంపతులు బుధవారం రాత్రి ఓ ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ తదితరులు హాజరయ్యారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రం ఎక్కడా కనిపించలేదు.