మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మరికొన్ని గంటల్లో ఓ ఇంటికి కోడలు కాబోతోంది. గుంటూరు కి చెందిన చైతన్య ను వివాహం చేసుకోబోతోంది నిహారిక. ఇప్పటికే పెళ్లి పనులకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా నిహారిక పెళ్లి సందర్భంగా నాగబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. నిహారికను పెళ్లి కుమార్తెగా అలంకరించిన సమయంలో అన్న, వదిన తో కలిసి దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ కుటుంబంగా మీకు మూలాలు అందించాం. నువ్వు ఎగరడానికి కావలసిన రెక్కలు తండ్రిగా ఇచ్చాను. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు తీసుకు వెళతాయి. అలాగే ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులు ఇవే. లవ్ యు నిహారిక అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.