డ్రగ్స్ కేసు వ్యవహారంలో మెగా డాటర్ నిహారిక వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే దీంతో ఒక్కసారిగా నిహారిక పేరు మారుమోగిపోయింది. ఈ తతంగానికి ముందు ఇంస్టాగ్రామ్ కి దూరంగా ఉన్న నిహారిక ఇటీవల ఇంస్టాగ్రామ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ అప్డేట్స్ ను కూడా షేర్ చేస్తుంది.
అలాగే సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ మళ్లీ సినిమాలపై దృష్టి కూడా పెట్టారు. కాగా తాజాగా తన తల్లి పద్మజ తో కలిసి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు నిహారిక. అయితే ఆ ఇంటర్వ్యూలో నిహారిక పై వస్తున్న వార్తలపై తల్లి పద్మజ స్పందించారు.
అత్యధిక గ్రాస్ వసూలు చేసిన 5 పాన్ ఇండియా చిత్రాలు మీకు తెలుసా ?
మొదట్లో ఇలాంటి వార్తలు రావడం ఇబ్బందిగా అనిపించేదని కానీ ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదని తెలుసుకున్నాను అంటూ తెలిపింది. తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు పద్మజ.
నిహారిక ఎక్కడికి వెళ్లినా నాకు ఏమీ అనిపించదు. నాకు నా కూతురు ఏంటో తెలుసు. మాకు మా బావగారు ఉన్నంతవరకు ఏం పర్వాలేదు… అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పద్మజ.
సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు మీకు తెలుసా !! షాక్ అవ్వాల్సిందే