పెళ్లయ్యాక మడిచేస్తా..

నిఖిల్- సంయుక్త హెగ్డే- సిమ్రన్ ప‌రీంజా కాంబినేషన్‌లో రానున్న మూవీ ‘కిరాక్ పార్టీ’. ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. దాదాపు రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌లో కంప్లీట్‌గా లవ్, కాలేజీ రాజకీయాల నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి.


నిఖిల్.. జూనియర్ స్టూడెంట్స్‌కి లీడర్‌ రోల్ చేశాడు. అంజనీష్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్ బాగుంది. ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్‌వర్మ దీనికి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి మాటలను అందిస్తుండటం మరో విశేషం. మరి ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం..