నిఖిల్ తాజా చిత్రం 18 పేజెస్. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీకి సుకుమార్ కథ-స్క్రీన్ ప్లే అందించాడు. అయితే.. నిఖిల్ గత చిత్రం కార్తికేయ-2 రేంజ్ లో ఇది సక్సెస్ అవ్వలేదు. దీనిపై నిఖిల్ స్పందించాడు. తన సినిమా స్లో పాయిజన్ అని, మెల్లగా ఎక్కుతుందని చెబుతున్నాడు.
“18 పేజెస్ సినిమా ఒక స్లో పాయిజన్. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో ఉంటుంది. ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అనుకున్నాను. నిజంగా సర్ ప్రైజ్ అవుతున్నాను. ఒక మంచి కథను బ్యూటిఫుల్ గా చెప్తే చాలా బాగుంటుంది. ఇది మాస్ ఎంటర్ టైనర్ కాదు. సిచ్యువేషన్స్ తో వెళ్తున్న కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ ను మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి”
ఇలా తన తాజా చిత్రం కూడా హిట్టని చెప్పే ప్రయత్నం చేశాడు నిఖిల్. అయితే.. అన్ని సినిమాల్లా ఇనిస్టెంట్ గా తన మూవీ హిట్టవ్వదని, స్లో పాయిజన్ లా మెల్లగా ఎక్కుతుందని అంటున్నాడు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతం అందించాడు. ధమాకా ధాటికి ఈ సినిమాకు వసూళ్లు తగ్గుతున్నాయి.