ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు తిరిగి నియామకం కానున్నారు. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ఈ మేరకు బాధ్యతలు స్వీకరించనున్నారు.
నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి రావడానికి వెనుక పెద్ర హైడ్రామానే నడిచింది. సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో కేసులు నడిచాయి. ఒక దశలో హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు వచ్చినా… ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఎస్ఈసీగా నియమించకపోగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు గడప తొక్కింది. దీనిపై నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా.. నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునర్నియమించాల్సిందేనని స్పష్టం చేసింది.
గవర్నర్ కూడా హైకోర్టు తీర్పునకే కట్టుబడటంతో.. ఎట్టకేలకు నిమ్మగడ్డ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా వస్తున్నారు.