చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ పై జగన్ మాఫియా అబద్ధపు ప్రచారం చేసిందని ఐ టి పంచనామా నివేదిక తో రుజువైంది. 2.63 లక్షలు దొరికితే న 2 వేల కోట్ల దొరికినట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తుంది. పరిపాలన చేతకాని వైసీపీ ప్రభుత్వం అబద్దాలు,అసత్యాల లో ఆస్కార్ అవార్డు కు పోటీ పడుతున్నారు. 43 వేల కోట్ల అవినీతితో 11 కేసులలో A1 గా ఉన్న జగన్ తన అవినీతి బురధను చంద్రబాబు కు అంటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిమ్మల. అభివృద్ధి ,సంక్షేమం తో టిడిపి రాజకీయం చేస్తే అవినీతి, ధనం, దౌర్జన్యం లతో వైసిపి రాజకీయం చేస్తుందన్నారు.