ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో హెల్త్ చెకప్స్ అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది ఆసుపత్రి యాజమాన్యం. ప్రైవేటు ఆసుపత్రులతో పోల్చితే 40శాతం వరకు తక్కువ ధరకే ఇక్కడ హెల్త్ చెకప్ ప్యాకేజీలు అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.
మొత్తం 12రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది నిమ్స్. మాస్టర్ హెల్త్ చెకప్‌తో పాటు, అన్నీ రకాల చెకప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ 12 రకాల ప్యాకేజీల వివరాలు ఇవే…..
కిడ్నీ హెల్త్ చెకప్ – రూ.1900
కేన్సర్ స్క్రీనింగ్ (పురుషులు) – రూ.2000
కేన్సర్ స్క్రీనింగ్ (స్త్రీలు) – రూ.500
టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్ – రూ.2500
లివర్ ప్రొఫైల్ – రూ.2200
ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ -పురుషులకు- రూ.7000
ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ -స్త్రీలకు – రూ.8000
మాస్టర్ హెల్త్ చెకప్ – రూ.2800
డయాబెటిక్ హెల్త్ చెకప్ – రూ.2100
వుమన్ వెల్‌నెస్ చెకప్ – రూ.4700
పీవర్ ప్రొఫైల్ – రూ.4500
అనీమియా టెస్ట్స్ – రూ.2000రెస్పిరేటరీ హెల్త్ చెకప్ – రూ.1500
బోన్స్ అండ్ జాయింట్స్ హెల్త్ – రూ.2400
కార్డియాక్ హెల్త్ చెకప్ – రూ.3800