సోషల్ మీడియా ప్రభావం పెరిగాక నెటిజన్లు చిన్న పని చేసినా దానికి సంబంధించిన ఫొటోనో, వీడియోనో పెట్టి తమ స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నారు. అలాగే పోస్టులు కూడా పెడుతున్నారు. షాప్‌కు వెళ్తున్నాననో, సినిమా చూశాననో, రెస్టారెంట్ లో తిన్నాననో, ఫలానా ప్రదేశాన్ని విజిట్ చేశాననో.. పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నటి నీనా గుప్తా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
65 ఏళ్ల నీనా గుప్తా తెలుపు రంగు షర్ట్, డెనిమ్ షార్ట్స్ ధరించి ఓ చిన్న యెల్లో కలర్ బ్యాగ్‌తో బయటకు వచ్చింది. అనంతరం తాను షాపింగ్ వెళ్తున్నానని చెబుతూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో తమ యాక్టివిటీలకు చెందిన ఫొటోలను షేర్ చేస్తున్నారు కదా.. అందుకనే నేను కూడా నా యాక్టివిటీకి చెందిన క్లిప్‌ను షేర్ చేశా.. అని వీడియోలో తెలిపింది.
ఇక నీనా గుప్తా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆమె పోస్టుకు అనేక మంది నెటిజన్లు లైక్ కొట్టారు. అలాగే రియా కపూర్, స్మృతి ఇరానీ వంటి సెలబ్రిటీలు ఆ పోస్టుకు కామెంట్లను పెట్టారు. ఐ లవ్ ఇట్ అని రియా కపూర్ కామెంట్ చేయగా.. స్మృతి ఇరానీ.. యు రాక్, నీనా జీ.. అని కామెంట్ చేశారు.
కాగా నీనా గుప్తా బధాయీ హో, పంగా వంటి సినిమాల్లో నటించింది. అలాగే పంచాయత్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది.