బీజేపీ మాస్టర్ మైండ్, కేంద్రమంత్రి అమిత్ షా బెంగాల్ లో పర్యటన వేడి పుట్టిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో… ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన బీజేపీ, టీఎంసీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తుంది.
ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకున్న బీజేపీ, సీఎం మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ అమిత్ షా ఈ పర్యటనలో ఏకంగా 9మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని బీజేపీలో చేరనున్నారు.
బీజేపీలోకి వెళ్లే నేతలు వీరే
1. సునీల్ మోండల్ – తృణమూల్ (ఎంపీ)
2. బనాశ్రీ మైతీ – తృణమూల్ (ఎమ్మెల్యే)
3. విశ్వజిత్ కుందు – తృణమూల్ (ఎమ్మెల్యే)
4. సైకత్ పంజా – తృణమూల్ (ఎమ్మెల్యే)
5. శీలభద్ర దత్తా – తృణమూల్ (ఎమ్మెల్యే)
6. సుక్రా ముండా – తృణమూల్ (ఎమ్మెల్యే)
7. సధీప్ ముఖర్జీ – కాంగ్రెస్ (ఎమ్మెల్యే)
8. తపసీ మోండల్ – సీపీఎం (ఎమ్మెల్యే)
9. అశోక్ దిండా – సీపీఐ (ఎమ్మెల్యే)
10. దిపాలీ విశ్వాస్ – ఎంపీ