సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ హిమా కోహ్లీ, నాగరత్న, రవికుమార్, సుందరేశ్, అభయ్ శ్రీనివాస్ ఓకా, విక్రమ్ నాథ్, జితేంద్ర కుమార్ మహేశ్వరి, బేలా త్రివేదీ, శ్రీనరసింహ ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వారితో ప్రమాణం చేయించారు.
సుప్రీంకోర్టులో ఇలా ఒకేసారి తొమ్మిది మంది జడ్జీలు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. ఇంకో విశేషమేంటంటే చరిత్రలో మొదటిసారి జడ్జీల ప్రమాణ స్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఇప్పటిదాకా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారమే ప్రత్యక్ష ప్రసారం అయ్యేది. కానీ.. ఈసారి జడ్జీల ప్రమాణాన్ని లైవ్ ఇచ్చారు.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం పంపిన 9 మంది పేర్లను ఇటీవల రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో వారంతా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.