హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను కరోనా మహమ్మారి వణికిస్తుంది. ఫస్ట్ వేవ్ సమయంలో ఏకంగా 50మంది సిబ్బంది వైరస్ బారిన పడగా… ఇప్పుడు సెకండ్ వేవ్ సందర్భంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. గత మూడు రోజులుగా మొత్తం 9మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.
క్రైం డిపార్ట్మెంట్ లో ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడగా… తాజాగా ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్ వచ్చింది. వైరస్ వ్యాప్తితో ఇతర సిబ్బందిలోనూ ఆందోళన మొదలైంది.