గురుకుల పాఠశాలలోని తొమ్మిది మంది విద్యార్థులకు ఎలుకలు కరిచిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం విద్యార్థులు అంతా కూడా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటన్ పల్లి శివారులో ఉన్న గురుకుల కేంద్రంలో సుమారు తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు.
కాగా గురుకుల కేంద్రంలో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటె అధికారులు, టీచర్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. పాఠశాలకు పిల్లలు వచ్చిన తరువాత బాధ్యత ఎవరిది అని నిలదీస్తున్నారు. బంగారు తెలంగాణలో పిల్లలు చదువుకునే పాఠశాలలో ఇలా ఉంటె ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.