ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. గత మూడు రోజులుగా పది వేల మార్కును క్రాస్ చేస్తూ వచ్చిన కరోనా కేసులు ఈ రోజు కూడా అదే స్థాయిలో నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,276 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు 58 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇవాళ అత్యధికంగా కర్నూల్ లో 1234, తూర్పు గోదావరిలో 876, విశాఖపట్నంలో 1155, అనంతపురంలో 1128, గుంటూరు 1001 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
చనిపోయిన 58 మందిలో లో అత్యధికంగాతూర్పు గోదావరి, విశాఖలో ఎనిమిది మంచి చొప్పున మరణించగా గుంటూరులో ఏడుగురు, అనంతపూర్, చిత్తూరు, కర్నూల్ లో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళం నలుగురు, కృష్ణ, పశ్చిమగోదారిలో ముగ్గురు చొప్పున, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరిద్దరు చొప్పున మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 150209 పాజిటివ్ కేసులు నమోదు కాగా 76614 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 72188 చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1407 మంది మృతి చెందారు.