నిరంజన్ రెడ్డి, తెలంగాణ మంత్రి
తెలంగాణ ధాన్యం కేంద్రం ఎందుకు కొనదు. దాదాపు 12వేలకు పైగా గ్రామ పంచాయతీలు ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖలు పంపాయి. ఇంతచేసినా మోడీ సర్కార్ నిరాకరిస్తోంది.
కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులకు అనుకూలంగా ఉండే సర్కార్ కోసం తెలంగాణ రైతులు బాటవేయాలి. కేసీఆర్ నాయకత్వంలో దేశ రైతాంగాన్ని జాగృతం చేయాలి.
అనతికాలంలోనే తెలంగాణ వ్యవసాయంలో అగ్రగామిగా ఎదిగింది. దురదృష్టవశాత్తు దేశంలో ఒక గుడ్డి ప్రభుత్వం ఉంది. వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఈ విషయం ముందే గ్రహించి రాష్ట్ర రైతాంగాన్ని జాగృతం చేశాం. కొందరు రైతులు తమను నమ్మి వరి సాగును ఆపేశారు.
బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారు. పంటంతా కొంటామని చెప్పి మోసం చేశారు. తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనేదాకా కేంద్రాన్ని వదిలి పెట్టం.