పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడి డిప్రెషన్‌లో ఉన్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు. ఆయన్ని భారత్ కు పంపితే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందన్న నీరవ్ మోడీ తరఫు న్యాయవాది వాదనలపై లండన్ హైకోర్టులో విచారణ జరుగుతోంది.
నీరవ్ మోడీ మానసిక పరిస్థితిని పర్యవేక్షించిన మానసిక వైద్యులు ఈ మేరకు కోర్టుకు నివేదిక అందించారు. నీరవ్ మోడీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని, ఆయన్ని భారత్ కు అప్పగిస్తే అక్కడ జైలులో ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని మానసిక వైద్యుడు ఫారెస్టర్ తెలిపారు.
మరోవైద్యుడు ఫజెల్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. నీరవ్ మోడీ ఓ మోస్తారుగా ఒత్తిడికి గురవుతున్నట్టు వివరించారు. నీరవ్ ప్రస్తుతం బాగానే పని చేస్తున్నాడని, అడిగిన ప్రశ్నలకు బాగా ఆలోచించి సమాధానాలు చెబుతున్నారని అన్నారు. నిద్రలేమి, తినడానికి, తాగడానికి అయిష్టత, భ్రమలు వంటి తీవ్రమైన నిస్పృహ లక్షణాలు ఆయనలో లేవన్నారు.
డిప్రెషన్ అనేది నయం చేయగల వ్యాధి అని ఫజేల్ అన్నారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న పరిస్థితి ఆయన ఆలోచిస్తున్నంత భయానకంగా మార్చకపోతే, అతని పరిస్థితి మెరుగుపడుతుందని ఫాజెల్ చెప్పాడు.
నీరవ్ మోడీని భారత్‌కు రప్పిస్తే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్‌బీలో 2 బిలియన్ డాలర్ల కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు.