దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు మరికొన్ని రోజుల్లో ఉరిశిక్ష వేయనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిర్భయ కేసు నిందితుల్లో ఒకరైన అక్షయసింగ్ ఉరిశిక్ష విధించటంపై రివ్యూ పిటిషన్ వేశాడు. ఉరిశిక్ష పై పునఃసమీక్ష చేయాలంటూ కోరాడు. ఉన్నత న్యాయస్థానం కూడా అక్షయ్ సింగ్ పిటిషన్ ను స్వీకరించింది.
2012 లో కదులుతున్న బస్సులో అతి దారుణంగా ఆరుగురు యువకులు నిర్భయపై అత్యాచారం జరిపారు. ఆ తరువాత తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. ఆ కేసులో అరెస్ట్ అయినా ఆరుగురిలో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావటంతో ఆ యువకుడి మినహా మిగిలిన నలుగురిని ఉరి తియ్యాలని సన్నాహాలు జరుగుతున్నాయి.