2012 ఢిల్లిలో జరిగిన నిర్భయ హత్యాచార ఘటనలో నలుగురు దోషులను శుక్రవారం ఉదయం 5.30గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు దోషులు చివరి వరకు ప్రయత్నం చేసినా… వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పవన్ గుప్తా పిటిషన్‌ను ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయగా… తన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని మరో దోషి ముఖేష్ పెట్టుకున్న అర్జీని పటియాలా కోర్టు కొట్టివేసింది. దీంతో నలుగురిని ఓకేసారి ఉరి తీసేందుకు లైన్ క్లియర్ అయ్యింది.
అయితే… పటియాల హైకోర్టు ముందు కొద్దిసేపు ముఖేష్ సింగ్ భార్య హల్చల్ చేసింది. తన భర్తను ఉరి తీయవద్దు అంటూ ఆందోళన చేసింది.