”నిర్భయ” దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మరోసారి సుప్రీంకోర్టు నాశ్రయించారు. మరణ శిక్ష నుంచి తప్పించమని కోరుతూ తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తన మరణిశిక్షను జీవిత ఖైదుగా మార్చమని పిటిషన్ లో కోరాడు. ఫిబ్రవరి 1న వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు. కేసులో నలుగురు దోషులను ఉరి తీయడానికి ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ దోషులు చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని పలు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో వారి డెత్ వారెంట్ పై స్టే ఇచ్చిన కోర్టు వారం రోజుల గడువిచ్చింది. గడువు లోపల వారికున్న అన్ని న్యాయ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. 2012 లో పారా మెడికల్ స్టూడెంట్ ”నిర్భయ”ను ఢిల్లీలో గ్యాంగ్ రేప్ ఆమె చావుకు కారణమైన నలుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష అమలులో సంవత్సరాలుగా జాప్యం జరుగుతోంది.