నిర్భయ దోషులను ఉరిశిక్ష నుంచి రక్షించేందుకు వారి తరుపు న్యాయవాది సరికొత్త వాదనతో వచ్చాడు. నిర్భయ దోషులను ఉరితీయవద్దని లాయర్ ఏపీ సింగ్ అఫిడవిట్ ఫైల్ చేస్తానని ప్రకటించారు. వారు దేశసేవ చేసేందుకు రెడీగా ఉన్నారని, దోషులను ఇండియా-పాక్ బార్డర్ కు పంపించాలని లేదా ఇండియా-చైనా సరిహద్దుకు పంపించాలని ఆయన కోరారు. అంతేకాని వారిని ఉరితీయద్దని సూచించారు.
నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే నలుగురు దోషులను శుక్రవారం ఉదయం 5-30గంటలకు ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలోనే మరో కొత్త ప్రతిపాదనతో దోషుల తరుపు న్యాయవాది ఏపీ సింగ్ వచ్చారు. ఎలాగైనా దోషులలకు ఉరిశిక్ష పడకుండా ఉండేందుకు ఏపీ సింగ్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకే మరో ప్రయత్నంగా దేశ సేవ అనే పల్లవి నెత్తుకొని సుప్రీంను ఆశ్రయించనున్నాడు.