ఏళ్లనాటి నిరీక్షణకు నేటితో తెరపడింది. ఢీల్లీలో అత్యంత పాశవికంగా నిర్భయ అనే పారమెడికల్ విద్యార్థిని దారుణంగా అత్యాచారం చేసిన దోషులకు శుక్రవారం ఉదయం ఉరిపడింది.దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దోషులకు ఉరిపడటంలో ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కాకుండా నిర్భయ తల్లి ఏడేళ్లుగా పోరాడిన తీరును దేశ ప్రజలంతా ప్రశంసిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నిర్భయ తల్లి ఆశాదేవిపై దోషుల లాయర్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆశాదేవిని శిక్షించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.రాత్రి 12 గంటల వరకు తన కూతురు ఎక్కడుందో, ఎవరితో ఉందో తెలియని నిర్బయ తల్లి ఆశాదేవిని శిక్షించాలంటూ డిమాండ్ చేశాడు.
కరోనాతో ప్రజలంతా మాస్క్ లు లేక ఇబ్బందులు పడుతుంటే…మాస్క్ లు ఇవ్వడానికి ఆలస్యం చేస్తోన్న కేంద్రం… ఉరితాళ్లను మాత్రం త్వరగా రెడీ చేయించిందని ఏపీ సింగ్ ఆరోపించారు. ఇక, ఏపీ సింగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.మొదట నిర్భయ దోషుల లాయర్ ఏపీ సింగ్ ను ఉరితీయలంటూ కామెంట్స్ చేస్తున్నారు.