టీఆర్ఎస్ సర్కార్ పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందన్నారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులను చేశారని, ప్రజలపై భారం మోపారని ఆమె విమర్శలు చేశారు.
రూ. లక్షల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క చుక్క కూడా నీరు రాలేన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు.
మంత్రాలు, తంత్రాల నెపంతో సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి చేస్తానంటే దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు నినాదాలతో ప్రజల ముందుకు టీఆర్ఎస్ వెళ్లిందన్నారు. కుల రహిత సమాజ నిర్మించడమే తమ లక్ష్క్ష్యమని టీఆర్ఎస్ పేర్కొందన్నారు. కానీ 2014 నుంచి 2018 వరకు మంత్రి వర్గంలో మహిళలకు చోటు కల్పించలేదన్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదట్లో మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదన్నారు. కానీ ఆ తర్వాత ప్రతి పక్షాలు, మీడియా ప్రశ్నించడంతో మహిళలకు మంత్రి వర్గంలో చోటు దక్కిందన్నారు. నియామకాలంటూ చెప్పిన కేసీఆర్ రాష్ట్రంలో ఆ మేరకు ఎందుకు ఉద్యోగాల భర్తీ చేయట్లేదని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.