కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె హాస్పిటల్ లో చేరారు. 63 ఏళ్ల నిర్మలా సీతారామన్ కు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కడుపు నొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి రొటీన్ చెకప్ కోసం ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ ను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్న సమయంలో నిర్మలా సీతారామన్ ఆసుపత్రి పాలవ్వడం ఆందోళన కలిగించింది.
కామర్స్, పరిశ్రమల ఛాంబర్ల ప్రతినిధులతో సహా వివిధ విభాగాల అభిప్రాయాలను సేకరించేందుకు ఆమె ఇప్పటికే ప్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. 2024 ఏప్రిల్, మే నెలలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో మోడీ 2.0 సర్కార్ కు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కానుంది.