జూలై నాటికే లక్ష్యానికి మించి వాక్సినేషన్ పూర్తి చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖ చిన వాల్తేరు ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. వాక్సినేషన్ పక్రియ ఎలా జరుగుతుందో జిల్లా కలక్టర్ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 22 లక్షల మందికి వాక్సిన్ వేయగా అందులో 17 లక్షల మందికి మొదటి డోసు, 5 లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు వివరించారాయన. అలాగే రాష్ట్రంలో 2.36 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారని… వారిలో 1.74 కోట్ల మందికి ఫస్ట్ డోసు మిగిలిన వారికి రెండు డోసులు వేసినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 50కోట్ల మందికి వాక్సిన్ అందించినట్లు చెప్పారు నిర్మలా సీతారామన్. వాక్సినేషన్ కు అయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తోందని అన్నారు. రానున్న రెండు నెలల్లో సరఫరా మరింత పెరుగుతుందని, దానికోసం దేశీయంగాగానే కాకుండా విదేశీ వాక్సిన్లకు కూడా అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. వాక్సినేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ప్రతీరోజు తెలియ జేయుటం ద్వారా పారదర్శకత పాటిస్తున్నామన్నారు నిర్మలా సీతారామన్.