కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ అధికారి పట్ల ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన హోదా, ప్రోటోకాల్ వంటి అంశాలను పక్కన పెట్టి మనసున్న మనిషిగా వ్యవహరించారంటూ పొగడ్తలు గుప్పిస్తున్నారు. ఇంతకీ నిర్మలా సీతారామన్ ఏం చేశారంటే..?
నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో భాగంగా.. ముంబైలోని ఓ హోటల్‌లో విద్యార్థుల కోసం పెట్టుబడులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి గురించి ఎన్‌ఎస్‌డీఎల్ ఎండీ పద్మజ చుండూరు మాట్లాడుతున్నారు. ప్రసంగం మధ్యలో మంచినీళ్ల కోసం ఆమె హోటల్ సిబ్బందిని అడిగారు. అయితే, వేదికపైనే ఉన్న కేంద్ర మంత్రి వెంటనే తన కుర్చీలో నుంచి లేచి ఆమె దగ్గరికి వెళ్లి గ్లాస్‌తో పాటు మంచినీళ్ల సిసాను అందించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారు నిర్మలా సీతారామన్ విశాల హృదయాన్ని అభినందిస్తూ చప్పట్లతో ప్రశంసించారు. తనకు స్వయంగా కేంద్ర మంత్రి స్వయంగా నీళ్లు సీసాను అందించడంపై పద్మజ చుండూరు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వీడియో ట్విట్టర్ షేర్ చూస్తూ.. ‘ఇది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాల హృదయం, వినయం, విలువలను ప్రతిబింబిస్తుంది.. ఇంటర్నెట్‌లో ఈ రోజు మనసుకు హత్తుకునే వీడియో ఇది’ అని అన్నారు. అలాగే, ‘ఇది ఎంత అద్భుతమైన సంఘటన.. మీ వినయాన్ని ఎంతో గౌరవిస్తున్నాను మేడమ్’ అంటూ నిప్పాన్ ఈడీ, సీఈవో సందీప్ సిక్కా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్మలా సీతారామన్ ప్రశంసంల్లో ముంచెత్తుతున్నారు.
ఇక ‘మార్కెట్ కా ఏకలవ్య’ పేరుతో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘మార్కెట్ కా ఏకలవ్య ద్వారా ఆర్థికపరమైన అక్షరాస్యత అవసరం ఉన్నవారు చాలా మంది అవగాహన పెంచుకుంటారు.. మార్కెట్ గురించి తెలుసుకోవాలనే ప్రజలకు ఆసక్తి ఉన్న సరైన సమయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఎన్‌ఎస్‌డీఎల్ విధానం సరైందే’ అని ఆమె అన్నారు.
This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values.
A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8
— Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022
Advertisements