దేవసేన అనుష్క భాగమతి తర్వాత బాగా గ్యాప్ తీసుకోని నటించిన సినిమా సైలెన్స్. ఇప్పటివరకూ లేడీ ఓరియెంటెడ్ భారీ బడ్జట్ సినిమాల్లో మాత్రమే కనిపించిన అనుష్క, మొదటిసారి కంప్లీట్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ లో నటిస్తోంది. మాటలు రాని పెయింటర్ పాత్రలో కనిపించనున్న అనుష్క ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ టీజర్ ని డైరెక్టర్ పూరి జగన్నాధ్ రిలీజ్ చేశాడు. రొమాంటిక్ సెట్స్ నుంచి ఈ టీజర్ ని రిలీజ్ చేసిన పూరి, టీజర్ రిలీజ్ చేయడం చాలా ఎక్సయిటింగ్ గా ఉందని ట్వీట్ చేశాడు.
1:14 నిమిషాల డ్యూరేషన్ తో వచ్చిన నిశ్శబ్దం టీజర్, ఒక చిన్న పాపతో మొదలయ్యి, వరస మర్డర్స్ తో ఇంట్రెస్టింగ్ గా సాగింది. పెయింటర్ అనుష్క, మ్యూజిషియన్ మాధవన్ కలిసి వెకేషన్ కి వెళ్తే అక్కడ మర్డర్ జరిగిందా? లేక వేరే ఏదైనా సంఘటన జరిగిందా అనేది క్లియర్ గా తెలియలేదు కానీ ఒక సిట్యుయేషన్ అండ్ దాని చుట్టూ జరిగిన కాంసీక్వెన్సెస్ తో అల్లిన కథ ఇది అని అర్ధమవుతుంది. స్పీడ్ అండ్ రేసీగా కట్ చేసిన నిశ్శబ్దం టీజర్ లో ప్రతి ఆర్టిస్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అనుష్క ఒక్క సీన్ తోనే ఆకట్టుకుంది. హాస్పిటల్ బెడ్ పైన ఏదో జరిగినట్లు చెప్పడానికి అనుష్క ప్రయత్నించే విధానం ఆకట్టుకుంది. టీజర్ లో కనిపించింది కాసేపే అయినా ఒక చిన్న పాపా, అండ్ ఒక సైకోలా కనిపిస్తున్న వ్యక్తి చూడగానే భయపడేలా చేస్తున్నారు. టీజర్ ఫాస్ట్ ఫేజ్ లో కట్ చేయడంతో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ పూర్తి స్థాయిలో అనలైజ్ చేసే ఛాన్స్ లేదు. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. షూటింగ్ అంతా ఫారిన్ లోనే తీయడంతో టీజర్ రిచ్ గా కనిపిస్తుంది. కోనవెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాని హేమంత్ డైరెక్ట్ చేస్తున్నాడు.