టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా లో కొన్ని ఫొటోస్ ను షేర్ చేసింది. త్వరలో తల్లి కాబోతున్న తన సోదరి పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను షేర్ చేసింది.
అవును! ఇది అధికారికంగా అధికారికం.. నాకు మరొక బిడ్డ ఉంది. ఇక్కడే ఈ కడుపులో నేను దాచుకున్నాను. ఆ చిన్న ప్రేమను కలుసుకోవడానికి వేచి ఉండలేను.
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ, నేను మీకు ఎప్పటికీ మంచి ఆరోగ్యం, బలం ఉండాలని కోరుకుంటున్నాను. అందమైన తల్లిదండ్రుల ప్రయాణాన్ని ప్రారంభించినందుకు మీ ఇద్దరికీ శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక సినిమాల విషయానికి వస్తే కాజల్ నటించిన హే సినామిక, ఆచార్య విడుదల కావాల్సి ఉన్నాయి. కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ దశలో ఉంది.