చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం చెక్. కాగా చెక్ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. అయితే జైలు గదిలో నితిన్ ని చూపిస్తూ జైల్లో ఆదిత్య అనే ఖైదీ అద్భుతంగా చెస్ ఆడుతున్నాడు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ని ఇచ్చారు.
ఇదిలా ఉండగా మరోవైపు ఆదిత్య కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు నివ్వడం… దేశద్రోహి, అది నీ గుర్తింపు అంటూ మరో వాయిస్ వినిపించడం సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఇక ప్రస్తుతం నితిన్ రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.