గతేడాది రిలీజ్ అయిన భీష్మ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం రంగ్ దే,చెక్ సినిమాలు చేస్తున్నాడు. కాగా చెక్ సినిమా ఈ నెల 19న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఉరిశిక్ష పడిన ఖైదీ గా నితిన్ కనిపిస్తుండగా రకుల్ లాయర్ గా కనిపించింది. ఛాంపియన్ అయిన నితిన్ ఖైదీగా ఎలా మారుతాడు అనేది ఈ సినిమా కథ. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో నితిన్ హిట్ కొట్టి సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈనెల 19 వరకూ వేచి చూడాల్సిందే.