శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ నూర్జహన్, సంపత్ కుమార్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ నుంచి నూర్జహాన్ పి.ఆర్.పి. పార్టి నుంచి పోటిచేసి ఓటమి చవిచూసింది. ఆమే కూతురు యూ.ఎస్. లో ఎంబిఏ చేసిన శాలిని, నాల్గు సంవత్సరాలుగా తెలంగాణ ఫేమ్ హీరో నితిన్, ఇద్దరు ప్రేమించుకున్నారు.
శాలిని తల్లి నూర్జహన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ కు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి డాక్టర్ గా నిరుపేదలకు సేవలందిస్తున్నారు. రాజకీయంగా రానించలేకపోయిన డాక్టర్ గా ప్రజల మద్య ఉంటూ సేవలందిస్తున్నారు. హీరో నితిన్ పాలమూర్ జిల్లాకు అల్లుడు కాబోతునందుకు నాగర్ కర్నూల్ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మాసంలో 14వ తేదిన వివాహం దుబాయ్ లో జరుగనున్నట్లు సమాచారం.
ఇక వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్, రష్మిక హీరో హీరోయిన్ లుగా వస్తున్న సినిమా భీష్మ.. ఫిబ్రవరి 21 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన లుక్స్, సాంగ్స్ సినిమాపై అంచులను పెంచుతున్నాయి. చలో సినిమాతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుములు భీష్మ సినిమా సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.