వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమా ఫిబ్రవరి 21 న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ తెగ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్ లో భాగంగా హీరో నితిన్, రష్మిక కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. ఒక రోజు షూటింగ్ టైంలో కుక్క బిస్కెట్ లు తిన్నానని చెప్పుకొచ్చింది రష్మిక. అయితే తినాలనిపించి తిన్నానని, నిజానికి వాటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించి తిన్నానని నవ్వుతూ చెప్పుకొచ్చింది. అయితే అదే విషయాన్ని నితిన్ కు తెలిసి నన్ను ఇప్పటికి ఏడిపిస్తారంటూ తెలిపింది.
ఫిబ్రవరి 21 న భీష్మ సినిమా రిలీజ్ కానుంది. చలో సినిమాతో సక్సెస్ కొట్టిన వెంకీ ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడా లేదో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.