వరుణ్‌తో నితిన్ - Tolivelugu

వరుణ్‌తో నితిన్

అప్పుడు వెంకటేశ్.. ఇప్పుడు నితిన్… ఇంతకీ అప్పుడేమయ్యింది? ఇప్పుడేమయ్యిందీ అనుకుంటున్నారా? అసలు వెంకటేశ్. నితిన్‌ మధ్య లింకేంటని అనుకుంటున్నారా? వరుణ్‌తేజ్ తెర పంచుకుంటున్నహీరోలు ఈ ఇద్దరూ.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌తో ఫ్రస్ట్రేషన్ పంచుకుంటూ ప్రేక్షకులకు ఫన్ అందించిన వరుణ్ ఇప్పుడు మరొక హీరో నితిన్‌తో కలిసి తెర పంచుకుంటున్నాడు. వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘వాల్మీకి’లో యంగ్ హీరో నితిన్ ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. ఇటీవలే తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కంప్లీట్ చేశారట కూడా.
రీమేక్ సినిమాలను కూడా తనదైన స్టయిల్లో ఒరిజినల్ సినిమా అనిపించేలా చేసే స్పెషలిస్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమిళ సూపర్ హిట్ సినిమా “జిగర్తాండ”ను “వాల్మీకి”గా రీమేక్ చేస్తున్న విషయం తెలుసుగా. ఒరిజినల్ సినిమాలో లేని హీరోయిన్ పాత్రగా పూజా హెగ్డేను వరుణ్‌కి జంటగా చేర్చేశాడు హరీశ్. అలాగే ఒరిజినల్‌లో విలన్‌తో పాటూ సాగే కీలక హీరో పాత్రను తగ్గించేసి ఒక చిన్న తమిళ హీరో అధర్వను తీసుకున్నాడు. వరుణ్ చేస్తున్న విలన్ రోల్‌ను బాగా పెంచేసి మెయిన్ రోల్ చేసేశాడు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు మరింతగా అట్రాక్షన్ పెంచెయ్యడానికి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చేత కూడా ఈ సినిమాలో ఒక చిన్న రోల్ చేయించాడట దర్శకుడు హరీశ్ శంకర్. సినిమాలో కూడా అది ఒక సినిమా హీరో పాత్రే. ఒరిజినల్ తమిళంలో కూడా ఒక హీరో పాత్ర ఉంటుంది. అందులో తమిళ క్రేజీ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరిశాడు. అది సినిమా క్లైమాక్స్‌లో కాసేపు వచ్చే పాత్ర. ఇప్పుడు అదే పాత్రలో నితిన్ కనిపించబోతున్నాడట. మరి ఈ పాత్ర కేవలం కాసేపుండే అతిథి పాత్రేనా, లేక హరీశ్ శంకర్ తన స్టైల్లో నిడివి పెంచేశాడా అనేది ఈ 20న విడుదలయ్యాక సినిమాలో చూడాలి.

Share on facebook
Share on twitter
Share on whatsapp