హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే ప్రస్తుతం మాస్ట్రో చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా తాను నటిస్తున్న 31వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వినాయక చవితి సందర్భంగా సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు.
ఈ చిత్రం లో నితిన్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించనుంది. ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. అంతేకాక శేఖర్ ఈ చిత్రం తో దర్శకుని గా మారనున్నారు.