ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మీక మందన్న హీరోహీరోయిన్‌లుగా వస్తున్న సినిమా భీష్మ. ఈ నెల 21 రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన థియరేటికల్ ట్రైలర్స్, లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవటంతో సినిమాకు మంచి బిజినెస్ లభించింది. సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాణ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టాయి.
నిజానికి షూటింగ్ సమయంలో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువవుతుండటంతో నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ మొదట బడ్జెట్‌పై తర్జనభర్జన పడ్డారట. కానీ గత రెండు వారాల్లో సినిమా బిజినెస్ చూసిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ నితిన్‌తో మరో సినిమా తీసేందుకు మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతోనే నితిన్ సినిమాకు ఆఫర్ చేయగా నితిన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనపడుతోండగా, భీష్మలో మంచి మ్యూజిక్ అందించిన స్వర సాగర్ మహతి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది.