హీరో నితిన్ అసలు పేరు నితిన్ రెడ్డి. ఇప్పుడీ హీరో తన కొత్త సినిమాలో సిద్దార్థ్ రెడ్డిగా కనిపించబోతున్నాడు. మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాకు దర్శకుడు రాజశేఖర్ రెడ్డి. ఈ మూవీలో నితిన్ జిల్లా కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. అతడి పాత్ర పేరు సిద్దార్థ్ రెడ్డి.
నితిన్ పాత్రను ఈరోజు సరికొత్తగా ప్రకటించారు. ఓ జీవో రిలీజైనట్టు చూపించి, అందులో నితిన్ పాత్ర పేరు సిద్దార్థ్ రెడ్డిగా పరిచయం చేశారు. ఇందులో ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. మార్చి 26న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు సిద్దార్థ్ రెడ్డి ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.
ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వంలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేసారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. క్యాథరీన్ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది.
రీసెంట్ గా మ్యాస్ట్రోతో ఓటీటీలో సైతం ఫ్లాప్ అందుకున్న నితిన్.. ఇప్పుడు తన హోప్స్ అన్నీ మాచర్ల నియోజకవర్గం పైనే పెట్టుకున్నాడు. సక్సెస్ కోసం మరోసారి మాస్-యాక్షన్ ఫార్ములాను నమ్ముకున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.