హీరో నితిన్, రష్మీక మందన్న జంటగా వస్తోన్న సినిమా భీష్మ. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు సినిమాపై అంచనా పెంచగా… భీష్మ సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికేట్‌తో ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
నితిన్ కామెడీ టైమింగ్‌కు, రష్మీక అందం తోడవటం సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా తెలుస్తోంది. మొత్తం 2గంటల 20నిమిషాల సినిమా ఉండగా… క్లీన్ ఎంటర్‌టైనర్‌గా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మీక, నితిన్ డాన్స్ ఇరగదీయటంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నట్లు సమాచారం.
మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందివ్వగా, వెంకి కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అయిన భీష్మ… ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేసింది.