చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం చెక్. అయితే కరోనా కారణంగా అన్ని సినిమాలు షూటింగ్ ను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో షూటింగ్ లు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ సినిమాను నిర్మాత ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తోంది. త్రిల్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఏమైందో తెలియదు గానీ నితిన్ సినిమాకు ఆగిపోయిదంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నితిన్ అంధదున్ రీమేక్ సినిమాలో నటించడం మొదలు పెట్టాడు. ఈ సినిమాను ఎక్స్ ప్రెస్ రాజా దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్నాడు. హిందీ లో సీనియర్ నటి టబు చేసిన పాత్రలో తమన్నా నటిస్తోంది.