యంగ్ హీరో నితిన్ తర్వాతి మూవీ చెక్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా సినిమా తెరకెక్కింది. ఆనంద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జైలు నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఉరిశిక్ష పడ్డ ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ మధ్యకాలంలో ఈ నేపథ్యంలో సినిమా రాలేదు. చెక్ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్థన్ తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. కళ్యాణ్ మాళిక్ సంగీతం అందిస్తున్నారు.