నితిన్ పెళ్లి బ్యాచిలర్ హీరోల ఇళ్లలో చిచ్చు రాజేసిందట. ఇటీవలే తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకొన్న నితిన్ ఏప్రిల్ లో దుబాయ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. దాంతో నితిన్ పెళ్లి ఆయన వయస్సుతో సమతూకంగా ఉన్న హీరోల ఇళ్లల్లో గోలను మొదలెట్టాయట. 30ఏళ్ళు పైబడిన పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు టాలీవుడ్ లో కొంతమంది హీరోలు. ఈ క్రమంలోనే నితిన్ ఓ ఇంటి వాడు అవుతుండటంతో అతనికి వరుణ్ తేజ్ శుభకాంక్షలు తెలియజేస్తూనే … విచారం వ్యక్తం చేశాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
వరుణ్ తేజ్ గతంలో బ్యాచిలర్ లైఫ్ ను కొనసాగిస్తుండటంపై ఓ కామెంట్ చేశాడు. టాలీవుడ్ లో తనకు ఆదర్శంగా ప్రభాస్, రానా, నితిన్ ఉన్నారని…తన పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఇప్పుడు నితిన్ కూడా పెళ్లికి సై అంటుండటంతో వరుణ్ తేజ్ ఇంట్లో పెళ్లి గోల షురూ అయిందట. ఈ రచ్చ ఒక్క వరుణ్ తేజ్ ఇంట్లోనే అనుకుంటే పొరపాటే.. ప్రభాస్, సాయి ధరమ్ తేజ్ , రానా ఇంట్లో కూడా మొదలైందట.
పెళ్లి ప్రస్తావన తీసుకొస్తేనే ఆమడ దూరం పరిగెత్తే ఈ హీరోలకు నితిన్ పెళ్లితో పరీక్ష ఎదురైంది. నితిన్ పెళ్లిని సాకుగా చూపి హీరో పేరెంట్స్ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న యువ హీరోల పెళ్లి చేసేయాలనే తలంపుతో ఉన్నారు. మరి ఇంతకీ నితిన్ తరువాత ఎవరు పెళ్లి పీటలు ఎక్కుతారో చూడాలి.