బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అంధధూన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న మూవీ మ్యాస్ట్రో. యంగ్ హీరో నితిన్, హీరోయిన్లు నబా నటేష్, తమన్నా ప్రధాన పాత్రలు చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది, దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్‌ను పెంచింది చిత్ర యూనిట్. ఈ మేరకు ట్రైటర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
మ్యాస్ట్రో మూవీని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తుండగా.. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ విడుదల సమయంలో విడుదల తేదీపై క్లారిటీ రానుంది. వరుసగా ప్లాఫుల్లో ఉన్న నితిన్.. ఈమూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు