వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ 31 వ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేశారు చిత్ర యూనిట్. అలాగే మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. నూతన దర్శకుడు శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
ఇక ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే నితిన్ నటించిన మాస్ట్రో రిలీజ్ కి సిద్ధంగా ఉంది . మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.