వచ్చే నాలుగు నెలల్లో ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేయబోతున్న హీరో నితిన్. ప్రస్తుతం హిందీ మూవీ అందాదున్ రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ కన్నాల పూర్తికానుండగా… నితిన్ నటించిన చెక్, రంగ్ దే రిలీజ్ కు ముస్తాబయ్యాయి.
దీంతో నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు నితిన్. దాదాపు రెండు సంవత్సరాలుగా చర్చల దశలోనే కథను ఓకే చేసినట్లు తెలుస్తోంది. పవర్ పేట అనే మాస్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నారు. కృష్ణ చైతన్య డైరెక్టర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ వచ్చే మే నెల నుండి షూటింగ్ ప్రారంభించుకోనుంది.
ఫైనల్ స్క్రిప్ట్ విన్న నితిన్… సినిమా ఓకే చేయటంతో డైరెక్టర్ కో యాక్టర్స్ ను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫాక్టరీ ఈ సినిమాను తెరకెక్కించనుంది.