టాలీవుడ్ యువ హీరో నితిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. షాలిని అనే అమ్మాయిని నితిన్ వివాహం చేసుకుంటాడని… ఏప్రిల్ లో వీరి పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి కార్యక్రమాలు మొదలు అవుతున్నప్పటికీ… నితిన్ వివాహమాడే యువతి ఫోటో మాత్రం ఒక్కటి బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది. ఈమె నితిన్ కు కాబోయే భార్య అంటూ ఫోటో తెర చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా… ఏప్రిల్ 15న హైదరాబాద్ లో నితిన్, షాలినిల నిశ్చితార్థం జరగనుందని తెలుస్తోంది. ఆ మరుసటి రోజే ఏప్రిల్ 16న దుబాయ్ లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు సమాచారం. మొదట్లో వీరిద్దరి మధ్యనున్నది స్నేహమేనని కానీ రెండేళ్ల క్రితం వీరి ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారిందట. అయితే వాలెంటైన్ డే సందర్బంగా నితిన్ తన ప్రేయసికి తనదైన స్టయిల్ లో ప్రపోజ్ చేశాడట. నితిన్ హీరో కనుక సినిమాల తరహాలోనే ప్రొపోజ్ చేస్తే బాగోదని… ఒంటికాలిపై నిల్చుని షాలినికి ప్రపోజ్ చేశాడట. దాంతో నితిన్ చేష్టలకు ఆమె నవ్వుకొని ప్రేమను అంగీకరించారట.
Advertisements
హైదరాబాద్ లో నున్న నితిన్ ఇంట్లో శనివారం ప్రీ వెడ్డింగ్ పంక్షన్ నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ను మాత్రమే ఆహ్వానించారట. దుబాయ్ లో వివాహ కార్యక్రమం ఉండటంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వెళ్ళలేరని హైదరాబాద్ లోనే గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది.